నిజామాబాద్, 2026-08-08
నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలోని బోధన్ పోలీస్ స్టేషన్ను జోన్ బాసర డి.ఐ.జి శ్రీ ఆర్. భాస్కరన్, ఐ.పి.యస్. శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్కు చేరుకున్న ఆయనకు పోలీస్ అధికారులు, సిబ్బంది గౌరవ వందనం అందించారు. అనంతరం స్టేషన్లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలోని బోధన్ పోలీస్ స్టేషన్ను జోన్ బాసర డి.ఐ.జి శ్రీ ఆర్. భాస్కరన్, ఐ.పి.యస్. శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్కు చేరుకున్న ఆయనకు పోలీస్ అధికారులు, సిబ్బంది గౌరవ వందనం అందించారు. అనంతరం స్టేషన్లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
భద్రతా పరికరాలు, రికార్డుల నిర్వహణ
మొదటగా స్టేషన్లో సిబ్బందికి అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం రిసెప్షన్ సెంటర్ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి, వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు.
కేసుల దర్యాప్తు, పర్యవేక్షణ
తదుపరి పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించిన డి.ఐ.జి గారు, కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీషీటర్లు మరియు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
స్నేహపూర్వక పోలీసింగ్, పరిశుభ్రత
అలాగే స్టేషన్లో అమలవుతున్న 5 ఎస్ విధానం అమలు తీరును సమీక్షించి, ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, అత్యవసర సహాయం కోసం వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని స్పందించాలని తెలిపారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల డిజిటల్ నిర్వహణ, సిబ్బంది హాజరు, డ్యూటీ విధానాలు తదితర అంశాలపై కూడా డి.ఐ.జి గారు ఆరా తీశారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరిగేలా క్రమశిక్షణతో, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.
అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, సైబర్ నేరాలు
ప్రధానంగా అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్ కు సూచనలు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలో మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.











