బీజేపీ (భారత్ స్పెక్ట్రమ్) సెప్టెంబర్ 03
భారతీయ జనతా పార్టీ సిరికొండ మండల ప్రధాన కార్యదర్శి మలోత్ రాజేందర్ తండ్రి మరణించిన నేపథ్యంలో, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పటేల్ గురువారం రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మండల ప్రధాన కార్యదర్శి రాజేందర్ కుటుంబానికి దినేష్ కులాచారి పటేల్ పరామర్శ : భారతీయ జనతా పార్టీ సిరికొండ మండల ప్రధాన కార్యదర్శి మలోత్ రాజేందర్ తండ్రి పరమపదించిన విషయం తెలుసుకున్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పటేల్ గురువారం రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి పటేల్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు. ఆప్తుడిని కోల్పోవడం బాధాకరమని, ఈ విషాద సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తలకట్ల గంగారెడ్డి, సీనియర్ నాయకులు నాయుడి రాజన్న, సిరికొండ మండల అధ్యక్షులు గుర్రాల సంజీవరెడ్డి, ధర్పల్లి మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్, చౌటుపల్లి ప్రభాకర్, కనగందుల గోపి తదితర నాయకులు పాల్గొన్నారు.









