Bhimgal, 2026-06-05
భీంగల్ లోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఇందూర్ విభాగ్ గణిత విజ్ఞాన సంస్కృతి మహోత్సవ్ (సైన్స్ ఫేర్) కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సైన్స్ ఫేర్ పోటీలలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
భీంగల్ లోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఇందూర్ విభాగ్ గణిత విజ్ఞాన సంస్కృతి మహోత్సవ్ (సైన్స్ ఫేర్) కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సైన్స్ ఫేర్ పోటీలలో నిజామాబాద్ జిల్లాలోని భీంగల్, ఆర్మూర్, నిజామాబాద్ తో పాటు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, లింగంపేట్ శిశు మందిర్ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రతిభకు పురస్కారాలు
సైన్స్ ఫేర్ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సరస్వతి విద్యా మందిర్ భీంగల్ పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి.బసంత రెడ్డి, పాఠశాల ప్రధాన కార్యదర్శి శ్రీ నర్సయ్య, ఇందూర్ విభాగ్ కార్యదర్శి తెలంగాణ పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షులు రెడ్డి గారి హరిస్మరన్ రెడ్డి, సరస్వతి విద్యాపీఠం ఇందూర్ జిల్లా కార్యదర్శి రావుల రవినాథ్, సరస్వతి విద్యాపీఠం కామారెడ్డి జిల్లా కార్యదర్శి గిరెడ్డి రాజి రెడ్డి, కామారెడ్డి పాఠశాల ఉపాధ్యక్షులు సామ గంగారెడ్డి, తపస్ ఉపాధ్యాయ సంఘ పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు కీర్తి సుదర్శన్ చేతుల మీదుగా మెమొంటోలను అందజేశారు.
న్యాయ నిర్ణేతలుగా నిపుణులు
ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పీ లింబద్రి, ఏ గంగా మహేష, వై భూమేశ్వర్, ఎన్ శ్రీనివాస్, డి నరసింగరావు, పి శ్రీనివాస్, జి గంగాదాస్, ఆర్ ప్రదీప్, వై సునీల్, సిహెచ్ ధర్మపురి, ఏ కృష్ణ, ఎం రాజ్ కుమార్, కి.రవిచందర్, ఏ కళావతి వ్యవహరించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో భీంగల్ పాఠశాల విద్వత్ సమితి సంయోజక్ యేన్ను శ్రీధర్, ప్రబంధకారిని సభ్యులు మంచె గణేష్, ప్రధానాచార్యులు పి సాయి చరణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, అకాడమిక్ ఇంచార్జ్ నోముల అశ్విన్ రెడ్డి, కామారెడ్డి పాఠశాల ప్రధానాచార్యులు నల్ల నాగభూషణ్, ఆర్మూర్ పాఠశాల ప్రధానాచార్యులు ఏం వినోద్ కుమార్, వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.











