Bhimgal, 2026-06-05
భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం జరిగింది. ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు తెడ్డు అశోక్ ను మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించారు. ఇటీవల జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి ప్రకటించిన నూతన కార్యవర్గంలో ఈ నియామకం చోటుచేసుకుంది.
భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెడ్డు అశోక్ నియామకం అయ్యారు. ఇటీవల మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా తెడ్డు అశోక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకం ఉంచి మండల ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతం కొరకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
తన ఎంపిక కొరకు సహకరించిన పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్, మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.










