Bhimgal, 2026-06-05
భీంగల్ పట్టణంలోని సివిల్ కోర్టు ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి భవ్య శ్రీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం విద్యార్థినులకు నోటుపుస్తకాలు, పెన్నులు బహుకరించారు.

అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి భవ్య శ్రీ మాట్లాడుతూ, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం లభించిందని కొనియాడారు. భీంగల్లో కొత్త కోర్టును ఏర్పాటు చేసుకుని, మొదటిసారి జెండా ఎగురవేయడం సంతోషంగా ఉందని అన్నారు. కోర్టు ఏర్పాటు చేసుకోవడమే సంతోషంగా భావించకుండా, నేరాల రేటు పెరగకుండా చూసే బాధ్యత మనందరిదని తెలిపారు.
న్యాయవాది శంకర్ ప్రసంగం
న్యాయవాది శంకర్ మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాలతో మనం స్వాతంత్ర్యాన్ని పొందామని, ఈ రోజు వారందరి సేవలను స్మరించుకుంటూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నామని అన్నారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి భవ్య శ్రీ, సూపరిండెంట్ రమేష్, సిబ్బంది, న్యాయవాదులు శంకర్, గంగారెడ్డి, చైతన్య, భూమన్న, అవరి రమేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.