నడిగూడెం, 10 September
భారతీయ జనతా పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏలేటి మల్లిఖార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను భీమ్గల్ పట్టణంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ, మిఠాయిలు పంపిణీ చేశారు.
భారతీయ జనతా పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏలేటి మల్లిఖార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు... భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక భీంగల్.. భీమ్గల్ పట్టణ కేంద్రం లో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ స్వామి వారి గ్రామాలయం లో విశిష్ట పూజలు నిర్వహించి, బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టేషనరీ వస్తువులు పంపకం చేసి మిఠాయిలు పంపకం చేసి యువతకు నరేంద్ర మోదీ చేస్తున్న ఉన్నత విషయాలను విశ్లేషించి వారు చూపించే మార్గం లో వెళ్ళాలని తెలపడం జరిగింది. అలాగే మార్చి నెలలో జరిగే పరీక్షల లో భీమ్గల్ బాలికల ఉన్నత పాఠశాల మండల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన వారికి 10000 రూపాయలు జ్ఞాపిక అందిస్తామని విద్యార్థులలో ఉత్తేజం నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కనికరం మధు, యోగేశ్వర నరసయ్య,కొండ రాము గౌడ్, నవీన్,నవీన్,నీలం గంగాధర్,దయ ప్రవీణ్,గోపు సంజయ్,నరసయ్య, నరేందర్ గౌడ్, గంగాధర్, గౌతమి నర్సయ్య,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.









