కామారెడ్డి జిల్లా పోలీసులు గాంధారి ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్, కానిస్టేబుల్ అజార్ ఫరూక్ లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. వారికి నగదు రివార్డు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కామారెడ్డి జిల్లా గాంధారిలోని ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసులో అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న కామారెడ్డి పోలీసులు, రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు.
కామారెడ్డి జిల్లా పోలీసులు గాంధారి ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్, కానిస్టేబుల్ అజార్ ఫరూక్ లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. వారికి నగదు రివార్డు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కామారెడ్డి జిల్లా గాంధారిలోని ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసులో అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న కామారెడ్డి పోలీసులు, రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు.
5 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి, నగదు, స్కార్పియో వాహనం, గ్యాస్ కట్టింగ్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 5 రాష్ట్రాలు దాటి సాగిన పోలీసుల గాలింపులో భాగంగా గాంధారి ఏటీఎం చోరీ కేసులో రాజస్థాన్‌కు చెందిన నిందితుడిని పట్టుకున్నారు. నకిలీ నంబర్ప్లేట్లతో స్కార్పియో వాహనం వాడిన అంతర్రాష్ట్ర ముఠా ప్లాన్‌ను జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ వెల్లడించారు.
కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలలో కామారెడ్డి సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, పిట్లం ఎస్సై ఆంజనేయులు, సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు. నేరం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు, నేరానికి ముందు రోజు నుండి సీసీటీవీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అనుమానితుల కదలికలు, వాహనం గుర్తింపు సమాచారంతో ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.
నేరం జరిగిన విధానం
పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో నిందితుల ముందస్తు పక్కా ప్రణాళిక వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడినట్లు తేలింది. ఈ నేరాల కోసం నల్లరంగు మహీంద్రా స్కార్పియో వాహనాన్ని వాడుతూ, పోలీసుల కళ్లుగప్పేందుకు అసలు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లకు బదులుగా ఇతర వాహనాల నంబర్ గల ప్లేట్లను మారుస్తూ వారి ప్రయాణం కొనసాగించారు.
2026లో కరీంనగర్ ప్రాంతంలోని రెండు ఎస్బీఐ ఏటీఎంల వద్ద గ్యాస్ కట్టర్ సహాయంతో చోరీలకు పాల్పడినట్లు విచారణ ద్వారా తెలిసింది.
రాజస్థాన్ పోలీసులతో సమన్వయం
చోరీ విషయం తెలిసిన వెంటనే జిల్లా పోలీసులు రంగంలోకి దిగి, నేరస్తులు వాడిన వాహనం స్కార్పియోగా గుర్తించారు. చోరీ అనంతరం నిందితులు వాహనంలో రాష్ట్రం దాటి మహారాష్ట్ర, రాజస్థాన్ వైపు వెళ్తున్నట్లు గుర్తించిన కామారెడ్డి పోలీసులు సంబంధిత రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. చివరికి రాజస్థాన్‌లోని చేచాట్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి, బారికేడ్లు, రోడ్డు నిరోధక పరికరాల సహాయంతో వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాహనం ఎడమవైపు టైరు దెబ్బతినడంతో నిందితులు కొంతదూరం వెళ్లి వాహనాన్ని వదిలిపెట్టి, నగదు ఉన్న బ్యాగుతో సహా పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది.












