నిజామాబాద్, జూలై 14
నిజామాబాద్ నగరంలో డెంగ్యూ కలకలం రేపుతోంది. గాయత్రినగర్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని అల్వాల సాత్విక డెంగ్యూ బారిన పడి మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలేరియా అధికారుల వద్దకు దీనిపై ఎలాంటి రిపోర్టులు రాలేదని సమాచారం.
నిజామాబాద్ నగరంలోని గాయత్రినగర్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని అల్వాల సాత్విక డెంగ్యూతో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నగరంలోని విజయ్ పబ్లిక్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న సాత్వికకు కొన్ని రోజులుగా జ్వరం వస్తుండటంతో చికిత్స అందిస్తున్నారు. అయితే, చికిత్స పొందుతున్న ఆమె ఈ నెల 13న మృతి చెందింది.
విద్యార్థిని డెంగ్యూతో మరణించినట్లు వచ్చిన వార్తలపై మలేరియా అధికారులను వివరణ కోరగా, తమ వద్దకు ఎలాంటి నివేదికలు రాలేదని తెలిపారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల సమయం కావడంతో, విద్యార్థిని ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొంది ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.












