నిజామాబాద్, గురువారం
జాాబాోోసభుతణీచసీడీఎసబయయాగాచసయహాైసీసీఎసబృెుుాడహచ.ఈాడోసుాుాడటాళీడీఎసబయయాధాుుసాధీచసుుాు.ోీసీష.సాయచైతయఈాుెడచాు.
పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన పీడీఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన వారిపై సీసీఎస్ బృందం మెరుపు దాడి నిర్వహించి, 15 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు.
పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు, సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ డి. సాయినాథ్, ఎస్ఐ మహేష్ మరియు సిబ్బంది గురువారం సాయంత్రం 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజమ్ కాలనీలో ఈ దాడి చేపట్టారు.
దళారుల ద్వారా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఒక ఇంట్లో నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో అక్రమంగా బియ్యం నిల్వ చేసిన రహాన్ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు మోసిన్ పరారీలో ఉన్నాడు. అతనిపై కూడా కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కేసును ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అందించే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, తరలించడం లేదా విక్రయించడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని నిజామాబాద్ పోలీసులు హెచ్చరించారు.








