నిజామాబాద్, 11 September
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పోలీసులు పోగొట్టుకున్న పర్సును గుర్తించి, అందులోని బంగారు కమ్మలు, నగదు, సెల్ ఫోన్‌తో సహా బాధితురాలికి సురక్షితంగా అందజేశారు. సారంగాపూర్‌కు చెందిన జులేఖా బేగం తన పర్సును పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేశారు.
పోగొట్టుకున్న సొత్తును బాధితురాలికి అందజేసిన కమ్మర్పల్లి పోలీసులు. భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక కమ్మర్పల్లి. సారంగాపూర్‌కు చెందిన జులేఖా బేగం గురువారం నిజామాబాద్ నుండి చౌట్పల్లికి బంధువుల వివాహానికి ఆటోలో వస్తుండగా తన పర్స్ పోగొట్టుకున్నారు. అందులో ఒక తులం బంగారు కమ్మలు, రూ. 1,000 నగదు సెల్ ఫోన్ ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కమ్మర్పల్లి ఎస్ఐ సిహెచ్. సతీష్, ఏఎస్ఐ ఎం. వెంకట్ కుమార్, కానిస్టేబుల్ కె. దినేష్‌లను రంగంలోకి దింపారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పర్సును ట్రేస్ చేసి స్వాధీనం చేసుకుని, పోలీస్ స్టేషన్లో బాధితురాలికి సురక్షితంగా అందజేశారు. పోగొట్టుకున్న పర్సును వెతికి పట్టుకుని, బాధితురాలికి అందజేయడంలో సమర్థవంతంగా వ్యవహరించిన ఎస్ఐ సిహెచ్. సతీష్, ఏఎస్ఐ ఎం. వెంకట్ కుమార్, కానిస్టేబుల్ కె. దినేష్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ‘డయల్ 112’ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జులేఖా బేగం కుటుంబ సభ్యులు కమ్మర్పల్లి పోలీసులకు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


