సిరికొండ, 15 September
రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తీవ్రంగా విమర్శించారు. మండలం గడ్కోల్ గ్రామంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను మంగళవారం రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పార్టీ జెండాను ఎగురవేసి ప్రారంభించారు.
రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తీవ్రంగా విమర్శించారు. మండలం గడ్కోల్ గ్రామంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను మంగళవారం రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పార్టీ జెండాను ఎగురవేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోటు రంగారావు, గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల పట్ల వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వేదికగా అనేక రోజుల పాటు పోరాటం చేసిన సమయంలో పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారని అన్నారు.
రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పిస్తామని, రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ ఆ హామీలను అమలు చేయలేదని వారు విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వర్గాలకు అప్పగించే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. ఈ విధానాల వల్ల రైతాంగం మరింత సంక్షోభంలోకి నెట్టబడుతోందని అన్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొండి వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. రైతులకు భరోసా కల్పించే విషయంలో ప్రభుత్వం అనేక పరిమితులు విధిస్తోందని అన్నారు. పోడు భూములకు హక్కులు కల్పిస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. బలమైన ప్రజా పోరాటాల ద్వారానే ప్రజల మౌలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభం సందర్భంగా ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మొదటి రోజు శిక్షణ తరగతుల్లో వి.ఐ. రమణ తత్వశాస్త్రం అంశంపై బోధించారు.
కార్యక్రమంలో సెక్రటేరియట్ సభ్యులు కెచ్చల రంగయ్య, కట్ట రమ, వి. ప్రభాకర్, వి. కృష్ణ, చిన్న చంద్రన్న, ఎం. కృష్ణ, సూర్యం, హన్మేశ్, ఎస్.ఎల్. పద్మ, రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, బి. రాము, జి. రామయ్య, సి.వై. పుల్లయ్య, నందిరామయ్య, జిల్లా నాయకులు ఆర్. రమేష్, బి. దేవరం, నాయకులు ఆర్. దామోదర్, బి. బాబన్న, కిషోర్, రమేష్, రమ, సత్తెమ్మ, పుష్ప, జమున, లావణ్య తదితరులు పాల్గొన్నారు.











