నిజామాబాద్, జులై
రైతులకు అవసరమైన యూరియా ఎరువుల పంపిణీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల ద్వారా యూరియా స్లాట్ బుకింగ్ కు అవకాశం కల్పించిందని కు అవకాశం ..కలెక్టర్ఇలాత్రిపాఠి తెలిపారు. స్మార్ట్ ఫోన్ లేనివారు, ఆన్లైన్ లో బుక్ చేసుకోలేనివారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
రైతులకు అవసరమైన యూరియా ఎరువుల పంపిణీని మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మీ-సేవ కేంద్రాల ద్వారా కూడా యూరియా స్లాట్ బుకింగ్ కు అవకాశం కల్పించిందని ఆయన సూచించారు. అన్ని మీ-సేవ కేంద్రాల్లో యూరియా స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులోకి వచ్చిందని ఆయన వెల్లడించారు.
స్మార్ట్ ఫోన్ లేని రైతులు, స్వయంగా ఆన్లైన్ లో స్లాట్ బుకింగ్ చేసుకోలేని వారు తమ సమీపంలోని మీ-సేవ కేంద్రాన్ని సందర్శించి యూరియా స్లాట్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ అన్నారు.
స్మార్ట్ ఫోన్ సౌకర్యం లేని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో తమ అవసరాలకు సరిపడా యూరియా ఎరువులు పొందాలని ఆయన సూచించారు. ఈ విషయమై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.












