నిజామాబాద్, 28 July
నిజామాబాద్ నగరంలో 43వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యతను, ఎన్యూమరేషన్ ఫారాలు నింపాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.
నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని, ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారము నింపి బిఎల్ఓలకు ఇవ్వాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి సర్వేపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, సర్ కో ఆర్డినేటర్ ఆకుల లలిత, నూడా చైర్మన్ కేశ వేణు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శరత్, పార్టీ కోశాధికారి భక్త వత్సలమ్, ఏఐసీసీ అసెంబ్లీ కో ఆర్డినేటర్ ఘన్ రాజ్, కో ఆప్షన్ మెంబెర్ బొబ్బిలి మురళి, కాంగ్రెస్ నాయకులు జావీద్ అక్రం, నరేందర్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









