నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి జిల్లా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో జిల్లా నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో జిల్లా నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్‌తో పాటు రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, నాయకులు సంజీవయ్య, జాఫర్ హుస్సేన్, నిరంజన్ గౌడ్, జాకీర్ హుస్సేన్, నూత్పల్లి మారుతి తదితరులు పాల్గొన్నారు.












