జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం పరిశీలించారు.
అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి కలెక్టర్ ఈవీఎం గోడౌన్ ను పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు.
ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ పనులను పక్కాగా జరిపించాలని తెలిపారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, సిబ్బంది సాత్విక్, విజయేందర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.









