నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆధ్వర్యంలో, అదనపు డిసిపి (అడ్మిన్) శ్రీ ఎన్. శుభం ప్రకాష్ గారు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 13 ఫిర్యాదులను స్వీకరించారు. పోలీస్ కమిషనర్ శ్రీ రాజేష్ చంద్ర గారి ఆదేశాల మేరకు, ఫిర్యాదు దారుల సమస్యలను విని, చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.
సోమవారం, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి, సంబంధిత పోలీస్ స్టేషన్ ల యొక్క ఎస్.ఐ మరియు సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడారు.
అదనపు డిసిపీ శ్రీ ఎన్. శుభం ప్రకాష్ గారు, ప్రజలు పోలీసు సేవలను స్వచ్చందంగా వినియోగించుకుంటూ, వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా పని చేస్తారని చెప్పారు.
ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ, ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరించబడతాయని ఆయన వెల్లడించారు.







