నిజామాబాద్, మంగళవారం
ఆర్మూర్ పట్టణంలో ఇటీవల జరిగిన పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికలలో ఏకగ్రీవంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన షికారి శ్రీనివాస్ ను భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
ఆర్మూర్ పట్టణంలో ఇటీవల గెలుపొందిన పట్టు చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు షికారి శ్రీనివాస్ ని బిజెపి శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు మందుల బాలు ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంచెట్టి గంగాధర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు పోల్కం వేణు లు పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికలలో ఏకగ్రీవంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన షికారి శ్రీనివాసుని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొచ్కర్ పాన్ శ్రీనివాస్, బొట్టు రాజు, దోండి ఈశ్వర్, శ్రావణ్, అరుణ్, పోచంపాడ్ శ్రీనివాస్, బిజెపి నాయకులు జెస్సు అనిల్, యుగంధర్, వివేకానంద్, చెన్నారెడ్డి, కలిగోట ప్రశాంత్, చిట్టి బాజన్న, గోపి, అనేక్, నారాయణ, దశరథ్, తదితరులు పాల్గొన్నారు.












