Delhi, 2026-07-05
ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా శుభవార్త అందించింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులు ఎలాంటి తాకట్టు (కాలేటరల్), హామీ (గ్యారంటర్) అవసరం లేకుండానే విద్యా రుణం పొందే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులకు ఆటంకం కలగకుండా చూడాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా శుభవార్త అందించింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులు ఎలాంటి తాకట్టు (కాలేటరల్), హామీ (గ్యారంటర్) అవసరం లేకుండానే విద్యా రుణం పొందే అవకాశం ఉంది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
పీఎం విద్యాలక్ష్మి అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక విద్యా రుణ పథకం. దీని ద్వారా భారతదేశంలో లేదా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి బ్యాంకుల నుంచి ఆన్లైన్లో విద్యా రుణం పొందవచ్చు. అన్ని దరఖాస్తులను ఒకే డిజిటల్ పోర్టల్ ద్వారా సులభంగా సమర్పించే వీలుంది.
తాకట్టు (కాలేటరల్) లేదా హామీ ఇచ్చే వ్యక్తి అవసరం లేదు. అర్హత కలిగిన విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. రూ.7.5 లక్షల వరకు లోన్‌కు 75% క్రెడిట్ గ్యారంటీని ప్రభుత్వం అందిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల వరకు ఉంటే, రూ.10 లక్షల లోన్‌పై 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. కుటుంబ ఆదాయం రూ.4.5 లక్షల లోపు ఉంటే పూర్తి వడ్డీ సబ్సిడీ పొందే అవకాశం ఉంది. రుణం మంజూరు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. లోన్ మొత్తం డిజిటల్ రూపీ వాలెట్ ద్వారా విడుదల చేయబడుతుంది.
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ కోసం విద్యార్థులు మూడు దశల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా పీఎం విద్యాలక్ష్మి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయాలి. చివరగా, మీకు నచ్చిన బ్యాంకును ఎంపిక చేసి దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు స్థితిని కూడా ఆన్లైన్లోనే ట్రాక్ చేయవచ్చు.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి సంవత్సరం 22 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది.
ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 5,08,244 విద్యా రుణాలు మంజూరు చేయబడ్డాయి, వాటి మొత్తం విలువ రూ. 60,369.3 కోట్లు. 4,18,883 రుణాలు విడుదల చేయబడ్డాయి, వాటి మొత్తం రూ. 17,099.03 కోట్లు. 35,686 యాక్టివ్ డిజిటల్ రూపీ వాలెట్లు ఉన్నాయి. డిజిటల్ రూపీ ద్వారా రూ. 55.45 కోట్ల సబ్సిడీ చెల్లించబడింది. 2024-25లో 4,15,567 మంది విద్యార్థులు వడ్డీ సబ్సిడీ పొందారు, దీనికి రూ. 892.94 కోట్లు కేటాయించారు.
ఉన్నత విద్య కోసం ఆర్థిక వనరులు లేక చదువును ఆపివేయాల్సిన పరిస్థితులను తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. తాకట్టు, హామీ అవసరం లేకుండా బ్యాంకు రుణం అందించడం వల్ల వేలాది మంది విద్యార్థులు తమ ఉన్నత విద్య కలను సాకారం చేసుకునే అవకాశం పొందుతున్నారు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. అర్హత ఉన్నవారు అధికారిక పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుని, ప్రభుత్వ సబ్సిడీతో విద్యా రుణం పొందవచ్చు.











