తాడుకోలు గ్రామ పంచాయతీ రాజారాం దుబ్బ కాలనీలో ఈ నెల 1న ఈ ఘటన చోటుచేసుకుంది. అడవి పందుల వేటకు నాటుబాంబులు సిద్ధం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో రమేష్‌తో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రమేష్‌ను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల విచారణ, హెచ్చరిక
జనావాసాల మధ్య నాటుబాంబులు తయారు చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు విచారణలో వెల్లడైందని బాన్సువాడ సీఐ శ్రీధర్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
నాటుబాంబులు, పేలుడు పదార్థాల తయారీ, నిల్వ, వినియోగం చట్టరీత్యా నేరమని, ఇలాంటి ప్రమాదకర చర్యలకు ఎవరూ పాల్పడవద్దని సీఐ శ్రీధర్ హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

