గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మండలం కలిగోట్‌లో నిర్మిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయ నూతన క్యాంపస్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించిన ఆమె, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మండలం కలిగోట్‌లో నిర్మిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయ నూతన క్యాంపస్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించిన ఆమె, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆమె సూచించారు. విద్యార్థులతో పాటు బోధనా సిబ్బందికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆమె స్పష్టం చేశారు. తరగతి గదులు, డార్మెటరీలు, డైనింగ్ హాల్, లైబ్రరీ, బాలబాలికలకు ప్రత్యేక హాస్టళ్లు, సిబ్బంది నివాస గృహాల నిర్మాణానికి సంబంధించిన బ్లూప్రింట్‌ను ఆమె పరిశీలించారు.
మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి సదుపాయాలను సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని ఆమె సూచించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని ఆమె ఆదేశించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, మొరం నిల్వలకు నిబంధనల ప్రకారం వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ఆమె స్థానిక రెవెన్యూ అధికారులకు సూచించారు.
నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖతో పాటు ఇతర అనుమతులన్నీ పొందామని, ఎలాంటి ఆటంకాలు లేవని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కనీసం రెండు, మూడు వారాలకు ఒకసారి నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించాలని కలెక్టర్ ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియకు సూచించారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.












