జీజీహెచ్ నిజామాబాద్ లో వైద్యులు మరొక అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
జీజీహెచ్ నిజామాబాద్ లో వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలోని గుండె వైద్య సేవల విభాగం పీటీసీఏ (పెర్క్యుటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ) సర్జరీ చేసి ఓ ప్రాణాన్ని కాపాడింది.
65 ఏళ్ల వయస్సున్న బురాజీ అనేవ్యక్తి మంగళవారం రాత్రి తీవ్రమైన ఛాతినొప్పితో ఆస్పత్రికి వచ్చినప్పుడు, వైద్యులు ఆయనకు అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్జన్ తో గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు.
కార్డియాలజీ వైద్యులు వెంటనే థ్రాంబోలైసిస్ చేసి రోగిని స్థిరీకరించారు. గురువారం నిర్వహించిన యాంజియోగ్రామ్ పరీక్షలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రైట్ కరోనరీ ఆర్టరీ లో తీవ్ర బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో, కార్డియాలజీ బృందం విజయవంతంగా పెర్క్యుటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరీ యాంజియో ప్లాస్టీ పీటీసీని నిర్వహించింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.






