రావుట్ల గ్రామస్థులు అటవీ భూములను కబ్జా చేయడం ఆపాలని నేడు నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.
సిరికొండ మండలం రావుట్ల శివారులోని ఆటవి భూములను కబ్జా చేయడం ఆపాలని గ్రామస్థులు నిజామాబాద్ కలెక్టరేట్ లో నిరసన తెలిపారు. వారు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
గ్రామస్థులు పేర్కొన్నదాని ప్రకారం, అటవీ భూముల ఆక్రమణలు జరుగుతున్నాయని, తాము అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
జంగిలోడి తండాకు చెందిన వ్యక్తులు రావుట్ల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వేసవి కాలం నుండి ఈ ప్రక్రియ కొనసాగుతుందని వారు చెప్పారు.
తాము ఆక్రమణలను అడ్డుకోకపోతే, వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పై జిల్లా కలెక్టర్ అటవీ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.




