Mendora, 2022-06-02
మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ నిజామాబాద్ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను పోలీస్ కమీషనర్ అభినందించారు.
మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ నిజామాబాద్ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ మేరకు పోలీస్ కమీషనర్ వివరాలు వెల్లడించారు.
కేసు వివరాల ప్రకారం, మెండోరా మండలం దూద్‌గావ్ గ్రామానికి చెందిన ఫిర్యాదిదారు భాగ్యవతి ఇంటికి ఎదురుగా ఉన్న వేపచెట్టు విషయంలో నిందితుడు బుచ్చన్నతో గత నాలుగు సంవత్సరాలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 02-06-2022న ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఫిర్యాదిదారు కుమారుడు వసంత్‌తో నిందితుడు గొడవకు దిగాడు. చంపాలనే ఉద్దేశంతో వసంత్ తలను గోడకు మూడుసార్లు బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలకు చికిత్స పొందుతూ బాధితుడు అనంతరం మరణించాడు.
అంత్యక్రియల అనంతరం బంధువులు జరిగిన విషయాన్ని తెలుసుకొని అదే రోజు మెండోరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ శ్రీ గోవర్ధన్ రెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి, సమగ్ర ఆధారాలను సేకరించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నేరం రుజువైంది.
1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, నిజామాబాద్ న్యాయమూర్తి శ్రీమతి హరీష వాదనలను పరిగణనలోకి తీసుకొని, నేరం రుజువైనందున నిందితుడు బుచ్చన్నకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
ఇట్టి కేసులో నేరస్థుడికి శిక్ష పడడానికి కృషి చేసిన సీఐ బి. గోవర్ధన్ రెడ్డి (ఆర్మూర్ రూరల్ అప్పటి), జాన్ రెడ్డి (ఆర్మూర్ రూరల్ సీఐ ఇప్పటి), అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. నర్సింహా రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ గోవింద్ ఎస్సై, సిహెచ్ మురళి ధర్ రాజు ఏఎస్ఐ, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ ఎం. విషన్ గౌడ్ కానిస్టేబుల్ 858, ఎన్. లక్ష్మణ్ కానిస్టేబుల్ 2065, ఎస్. రాజు కానిస్టేబుల్ 1825 లను నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ అభినందించి, ప్రశంసించారు.








