ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు సాగుతూ పేదలకు అండగా నిలవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. లో శ్రీ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కిసాన్ ఫ్యాషన్ మాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించాలని సూచించారు.
పేదలను ఆదుకొని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా యువత వారాంతాల్లో హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
సేవ చేయడం ద్వారా సమాజంలో గుర్తింపుతోపాటు, నలుగురికి సహాయం చేశామన్న ఆత్మసంతృప్తి లభిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ధన్పాల్ ప్రణయ్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










