తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనులకు వాతావరణ శాఖ సూపర్ న్యూస్ అందించింది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి.
కరెక్ట్ టైమ్‌కి కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు, ప్రస్తుతం అక్కడ వేగంగా విస్తరిస్తున్నాయి. కేరళలో వానలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణకు వర్షాలు వచ్చే అవకాశం వచ్చే వారం (జూన్ రెండో వారంలో) ఉంది. రుతుపవనాలు వచ్చేలోపే, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రుతుపవనాల ఎంట్రీతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడనుంది. ఈ ఏడాది సాధారణం కంటే మంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
జనాలు తాజా అప్డేట్లను గమనిస్తూ అలర్ట్‌గా ఉండటం మంచిది.


