నిజామాబాద్ జిల్లా కలెక్టర్ త్రిపాఠి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో 146 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ కార్యక్రమం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించబడింది.
ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డీఆర్ఓ గీత, జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ లకు విన్నవించారు.
కలెక్టర్ అధికారులకు ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.







