నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS., ఈ నెల 20న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కు ప్రజలను ఆహ్వానించారు.
ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
ఈ లోక్ అదాలత్ ద్వారా చిన్న చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలను సులభంగా పరిష్కరించవచ్చని చెప్పారు.
ఈ అవకాశాన్ని వినియోగించుకుని న్యాయ స్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చని ఆయన సూచించారు.
శాంతియుత పరిష్కార విధానం కాబట్టి, పక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు.






