తెలంగాణ, 31 July
ఉద్యమ సహచరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన ఇక లేరన్న వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని అన్నారు.
ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యువును జయించి తిరిగి వస్తారనే ఆశతో మనమంతా ఎదురుచూశాం. కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉంది.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన సోదరుడిగా పెద్ది సుదర్శన్ అన్న ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు. ఆయన మన మధ్య లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు. వ్యక్తిగతంగా నాకు ఒక ఉద్యమ సహచరుడిని, ఆత్మీయ సోదరుడిని కోల్పోయిన బాధ ఇది.
పెద్ది సుదర్శన్ అన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని ఆశన్న గారి జీవన్ రెడ్డి తెలిపారు.










