మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గురువారం మండల కేంద్రంలో పర్యటించారు. ఇటీవల వివాహం చేసుకున్న మండల పరిషత్ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎంఏ షాహిద్ సోదరుడిని ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పర్యటనలో పలువురు స్థానిక నాయకులు ఆయనతో పాటు ఉన్నారు. సర్పంచ్ గాండ్ల రాజేష్, సీనియర్ నాయకులు దాసరి వెంకటేష్, నర్సారెడ్డి సాగర్ యాదవ్, బాల్కొండ రాజు, బుసం కిట్టు, కన్నా పోశెట్టి, కిసాన్ నగర్ సర్పంచ్ రామరాజు గౌడ్, బుస చింటు, అబ్రర్ షాకీర్, ముజహీద్, ఉబిద్ తదితరులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంట ఉన్నారు.










