భారత్ స్పెక్ట్రమ్ (భారత్ స్పెక్ట్రమ్) జూన్ 29
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మరింత విస్తరించనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి వచ్చే కొన్ని రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మరింత విస్తరించనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి వచ్చే కొన్ని రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయని పేర్కొంది.
వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
భారీ వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద నిలబడకుండా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా ఏటూరునాగారంలో 7.3 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా మొగ్దంపల్లిలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.






