నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.
19 సంవత్సరాల విద్యార్థిని గురువారం సాయంత్రం ఖలీల్వాడిలోని ప్రైవేట్ హాస్టల్ గదిలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.
తోటి విద్యార్థులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి వేధింపులు కారణమని సమాచారం అందింది.
అస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ మాట్లాడుతూ, విద్యార్థికి చికిత్స అందిస్తున్నారని, కోలుకున్న తర్వాత మరింత సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు.







