నిజామాబాద్, జూలై 12
మొపాల్ మండలం కంజర్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ విజయలలితకు కలెక్టర్ ఇలా త్రిపాఠి షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిర్వహణ లోపాలు ఉన్నట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో ఈ చర్య తీసుకున్నారు.
మొపాల్ మండలం కంజర్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ విజయలలితకు కలెక్టర్ ఇలా త్రిపాఠి షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిర్వహణపరమైన లోపాలు ఉన్నట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో ఈ చర్య తీసుకున్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థలను క్షేత్రస్థాయిలో సందర్శించి, వాటి నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మండల స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా కంజర్ గురుకుల విద్యాలయం నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి.
ఈ విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో జోనల్ అధికారిణి యుగంధర లక్ష్మిచే ప్రాథమిక విచారణ జరిపించారు. జోనల్ అధికారిణి సమర్పించిన నివేదికలో నిర్వహణ పరమైన లోపాలు ఉన్నట్లు వెల్లడి కావడంతో ప్రిన్సిపాల్ విజయ లలితకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ప్రభుత్వ విద్యా సంస్థల నిర్వహణలో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించబోమని, అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.











