Haryana, జూలై 17
భారత రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే ఘట్టం ఆవిష్కృతం కానుంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్యాసింజర్ ట్రైన్ ను జూలై 17న భారత రైల్వే ప్రారంభించనుంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి జింద్–సోనిపట్ మార్గంలో ఈ రైలు పరుగులు తీయనుంది.
భారత రైల్వే స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్యాసింజర్ ట్రైన్‌ను జూలై 17న ప్రారంభించనుంది. ఈ రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించి జింద్–సోనిపట్ మార్గంలో నడపనున్నారు.
స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ రైలు 10 కోచ్‌లను కలిగి ఉంటుంది. దీనికి 1,200 కి.వ హైడ్రోజన్ ప్రొపల్షన్ సిస్టమ్ అమర్చారు. ఈ రైలు గరిష్టంగా గంటకు 75 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. సుమారు 2,500 మంది ప్రయాణికులను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. మొత్తం ప్రయాణ దూరం సుమారు 90 కి.మీ.
మీడియా కథనాల ప్రకారం, ఈ రైలులో కనిష్ట టికెట్ ధర రూ. 5, గరిష్ట టికెట్ ధర రూ. 25 గా ఉండనుంది. అంటే చాలా తక్కువ ఖర్చుతోనే ఈ అత్యాధునిక రైలులో ప్రయాణించే అవకాశం లభించనుంది.
సాధారణ డీజిల్ రైళ్లు కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య వాయువులను విడుదల చేస్తాయి. అయితే, హైడ్రోజన్ రైలు నుంచి ఎటువంటి కాలుష్య వాయువులు విడుదల కావు. అందుకే దీనిని పర్యావరణ హిత రైలుగా పేర్కొంటున్నారు.
మొదటి దశలో జింద్–సోనిపట్ మార్గాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో దేశంలోని మరిన్ని విద్యుదీకరణ లేని రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ప్రయాణికులకు లాభాలతో పాటు పర్యావరణ హిత ప్రయాణం, తక్కువ టికెట్ ధర, ఆధునిక సాంకేతికత అనుభవం, నిశ్శబ్ద ప్రయాణం, భవిష్యత్ రైల్వే సేవలకు కొత్త దారి చూపుతుంది.







