నిజామాబాద్, సోమవారం
నిజామాబాద్జిల్లాలోనివేల్పూర్శ్రీగోవిందగిరిస్వామిదివ్యయోగాశ్రమసమీపంలోగలసీతారాంపల్లెలో,భక్తులుతమగురుభక్తినిచాటుకుంటూవరినాట్లువేశారు.వెంకటాపూర్గ్రామానికిచెందినశ్రీవేంకటేశ్వరసేవాసమితిఆధ్వర్యంలోజరిగినఈకార్యక్రమంలో,స్వామిశిష్యులు,భక్తులుస్వచ్ఛందంగాపాల్గొనిపొలంలోనాట్లువేశారు.
నిజామాబాద్ జిల్లాలో అనేక ఆశ్రమాలు ఉండగా, వాటిలో కొన్నింటికి వ్యవసాయ యోగ్యమైన సాగుభూములున్నాయి. వేల్పూర్ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమ సమీపంలోని సీతారాం పల్లెలో గల పొలంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన శ్రీ వేంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో, గోవింద గిరి స్వామి శిష్యులు, భక్తులు వరి నాట్లు వేసి తమ గురుభక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, తమ పనులను పక్కన పెట్టి వ్యవసాయ క్షేత్రంలో వరినట్లు వేయడం ద్వారా గురుభక్తిని చాటుకున్నారని ప్రశంసించారు. ఇలాంటి సద్బుద్ధిని సేవ రూపంలో చాటుకోవడం చాలా గొప్ప విషయమని, వారికి గోవింద గిరి స్వామి, జగన్మాత ఆశీస్సులు సదా ఉంటాయని అన్నారు.
అనంతరం, వరి నాట్లు వేసిన వ్యవసాయ భక్తులకు జ్ఞాపికలను బహుకరించి, లడ్డు ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మెండె పద్మిని మహేందర్ దంపతులు, కుంట సువర్ణ, వెంకటాపూర్ మల్లవ్వ, ఆలయ కమిటీ సభ్యులు, భక్త సేవకులు తదితరులు పాల్గొన్నారు.








