బోధన్, జూలై 13
ిజదజిపఅక్రమంగాజిిషే.అేిిపఅచేశ.అిదదచిజిిచే.దేడచిజిిిిచేిదిిప.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాబా గార్డెన్ వద్ద బోధన్ పట్టణానికి చెందిన షేక్. కమ్రాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతని వద్ద నుంచి 194 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో కమ్రాన్ నాందేడ్ నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు తేలిందని సీఐ తెలిపారు. నిషేధిత మత్తుపదార్థాలను అమ్మినా, కొన్నా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల అమ్మకం, కొనుగోలు, తరలింపు గురించి తెలిస్తే వెంటనే 1908 నంబర్‌కు గానీ, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సీఐ వెంకట నారాయణ విజ్ఞప్తి చేశారు.











