ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల హక్కుల కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓటు బచావో దేశ్ బచావో కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల హక్కుల కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓటు బచావో దేశ్ బచావో కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు. ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జిల్లా నుంచి చేరుకున్న నాయకులు, కార్యకర్తలతో కలిసి షబ్బీర్ అలీ రామ్లీలా మైదానానికి పయనమయ్యారు.
ఓటు హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రధాన లక్ష్యాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.












